Google today announced the most popular apps, games, movies, songs and the tv shows for the year 2017. Baahubali 2 title song ‘Saahore Baahubali’ was a roaring hit and it topped the list of the most streamed songs for the year 2017. Baahubali: The Game is the most popular game of the country. <br /> <br />ప్రముఖ సెర్చింజన్ గూగుల్ 2017 సంవత్సరంలో మోస్ట్ పాపులర్ యాప్స్, గేమ్స్, మూవీస్, సాంగ్స్ మరియు టీవీ షోల వివరాలు శుక్రవారం ప్రకటించింది. గూగుల్ రిపోర్టు ప్రకారం ఇండియాలో ఈ ఏడాది విడుదలైన 'బాహుబలి-ది కంక్లూజన్' చిత్రంలోని పాట, మొబైల్ గేమ్ టాప్ పొజిషన్లో నిలిచింది. <br />బాహుబలి-2 టైటిల్ సాంగ్ ‘సాహెరే బాహుబలి' ఇంటర్నెట్‌లో అత్యధికంగా స్ట్రీమ్ చేసిన పాటగా రికార్డులకెక్కింది. పలువు బాలీవుడ్ సాంగులను సైతం వెనక్కి నెట్టి ఈ పాట నెం.1 స్థానాన్ని సంపాదించుకుంది. <br />ఇండియాలో 2017 సంవత్సరంలో టాప్ లో ఉన్న గేమ్ కూడా ‘బాహుబలి: ది గేమ్' కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ గేమ్స్ ‘డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్స్', ‘సూపర్ మ్యారియో రన్', ‘పోకెమాన్ డ్యుయల్' గేమ్‌లను దాటి బాహుబలి మొదటి స్థానంలో నిలిచింది.
